ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు ప్రచారాన్ని ఖండించిన టీజీఎస్ఆర్టీసీ
- హైవేలపై టోల్ ఛార్జీలను పెంచిన కేంద్ర ప్రభుత్వం
- పెంచిన టోల్ ఛార్జీల మేరకు టిక్కెట్‌లో టోల్ సెస్‌ను సవరించినట్లు వెల్లడి
- సాధారణ ఛార్జీలు యథాతథంగా ఉన్నాయన్న టీజీఎస్ఆర్టీసీ
- సంస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరిక
ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరుగుతాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని టీజీఎస్ఆర్టీసీ బుధవారం స్పష్టం చేసింది. హైవేలపై టోల్ ఛార్జీలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన టోల్ ఛార్జీల మేరకు టిక్కెట్‌లోని టోల్ సెస్‌ను సవరించామని పేర్కొంది. దీంతో సాధారణ ఛార్జీలు యథాతథంగా ఉన్నట్లు పేర్కొంది.
సవరించిన టోల్ సెస్ ఈ నెల 3వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. సాధారణ రూట్లలో టిక్కెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. కానీ వాస్తవాలు తెలుసుకోకుండా టీజీఎస్ఆర్టీసీ సాధారణ బస్సు ఛార్జీలను పెంచిందంటూ సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని పేర్కొంది. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా తప్పుడు ప్రచారం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.