చంద్రబాబు, రేవంత్ రెడ్డిలపై బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు
- విభజన జరిగిన పదేళ్ల తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుట్రలు మొదలు పెట్టారని ఆరోపణ
- ఏపీ మాజీ సీఎస్‌ను తెలంగాణలో సలహాదారుగా ఎందుకు నియమించారని ప్రశ్న
- ఆదిత్యనాథ్ దాస్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుట్రలు మొదలు పెట్టారని ఆరోపించారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌ను తెలంగాణ నీటిపారుదల, జల వనరుల శాఖ సలహాదారుగా నియమించడంపై బాల్క సుమన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదిత్యనాథ్ నియామకం వెనుక దాగి ఉన్న రహస్యమేంటో చెప్పాలన్నారు. ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.