రేపు సాయంత్రం 4.41 గంటలకు సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబు
- ఏపీ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు
- ఈ సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల పయనం
- రేపు ఉదయం శ్రీవారి దర్శనం... మధ్యాహ్నానికి అమరావతి తిరిగి రాక
- రేపు సాయంత్రం సచివాలయానికి వెళ్లనున్న చంద్రబాబు
- మెగా డీఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై రెండో సంతకం
ఏపీ నూతన ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుమల వెళుతున్నారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
రేపు మధ్యాహ్నానికి తిరిగి అమరావతి చేరుకోనున్న సీఎం చంద్రబాబు... సాయంత్రం సచివాలయానికి వెళతారు. రేపు (జూన్ 13) సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్ లోని తన చాంబర్ లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు.
బాధ్యతల స్వీకారం అనంతరం... ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలక హామీల అమలుపై ముఖ్యమంత్రి హోదాలో సంతకాలు చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయనున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం పెట్టనున్నారు. సామాజిక పింఛన్ ను రూ. 4000 వేలకు పెంచుతూ ఫైల్ పై మూడో సంతకం చేయనున్నారు. స్కిల్ సెన్సస్ ప్రక్రియ చేపట్టడం, అన్నా క్యాంటీన్ ల ఏర్పాటుపై కూడా ఆయన సంతకాలు చేయనున్నారు.
కాగా, ఇవాళ ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు... ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్ర నూతన మంత్రివర్గ సభ్యులతో సమావేశమయ్యారు. పాలన, తదితర అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు.