చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అమిత్ షా-తమిళిసై వీడియో... తీవ్రంగా స్పందించిన డీఎంకే
- తమిళనాడు నాయకురాలిని బహిరంగంగా మందలించడం సరికాదన్న డీఎంకే
- ఇలా చేయడం తప్పుడు సంకేతాలను పంపుతుందన్న తమిళ అధికార పార్టీ
- అమిత్ షా తీరును దేశమంతా చూసిందని వ్యాఖ్య
- తమిళనాడు బీజేపీలో విభేదాలపై మందలించినట్లుగా ప్రచారం
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మధ్య జరిగిన చర్చకు సంబంధించిన వీడియోపై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే స్పందించింది. తమిళనాడుకు చెందిన ప్రముఖ నాయకురాలిని ఇలా బహిరంగంగా మందలించడం సరికాదని అభిప్రాయపడింది. దీనిని అందరూ చూస్తున్నారని తెలుసుకోవాలని పేర్కొంది. ఇలా బహిరంగంగా మందలించడం తప్పుడు సంకేతాలను పంపుతుందని డీఎంకే విమర్శలు గుప్పించింది.
డీఎంకే అధికార ప్రతినిధి శ్రవణన్ మాట్లాడుతూ... అమిత్ షా గతంలో బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారని, ఇప్పడు కేంద్రమంత్రి అని... కానీ మహిళా నాయకురాలి పట్ల బహిరంగంగా అలా ప్రవర్తించడం సరికాదన్నారు. అమిత్ షా తీరును తమిళనాడు, దేశమంతా చూసిందన్నారు.
అసలేం ఏం జరిగింది?
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అతిథిగా వచ్చిన తమిళిసై... వేదికపై కూర్చున్న నేతలను పలకరిస్తూ ముందుకు సాగారు. అక్కడే ఉన్న వెంకయ్యనాయుడును, అమిత్ షాను ఆమె పలకరించారు. ఆ తర్వాత ముందుకు కదులుతుంటే... అమిత్ షా ఆమెను వెనక్కి పిలిచారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏమిటో తెలియనప్పటికీ... అమిత్ షా సీరియస్‌గా మాట్లాడుతున్నట్లుగా ఉంది. దీంతో ఆమెను అమిత్ షా మందలించారనే ప్రచారం సాగుతోంది. ఎన్నికల అనంతరం తమిళనాడు విభాగంలో నేతల మధ్య అంతర్గత విభేదాల గురించి ఈ చర్చ జరిగి ఉంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.