ఏపీ నూతన సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన ఆనంద్ మహీంద్రా
- ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు
- చంద్రబాబుపై వెల్లువెత్తుతున్న విషెస్
- తెలుగులో ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా
- కృతజ్ఞతలు తెలియజేసిన చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబుపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు అంటూ ఆనంద్ మహీంద్రా తెలుగులో ట్వీట్ చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారంపై ఓ జాతీయ మీడియా సంస్థ చేసిన ట్వీట్ ను ఆనంద్ మహీంద్రా రీపోస్ట్ చేశారు.
ఆనంద్ మహీంద్రా విషెస్ తెలుపడం పట్ల చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ధన్యవాదాలు ఆనంద్ మహీంద్రా గారూ... మీ వంటి పారిశ్రామిక దిగ్గజాల శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి బాటలు వేయగలవని ఆశిస్తున్నాను అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
హైదరాబాద్ లో అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి తాను కూడా హాజరయ్యానని అన్నారు. ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. మీ డైనమిక్ నాయకత్వంలో మాత్రమే ఏపీకి సంబంధించి అమెరికా-భారత్ సంబంధాలు బలోపేతం అవుతాయని గట్టిగా నమ్ముతున్నామని ఆమె వివరించారు.
హైదరాబాదులో బ్రిటీష్ కాన్సుల్ జనరల్ గారెత్ విన్ ఓవెన్ ఏపీ నూతన సీఎం చంద్రబాబుకు, మంత్రి పవన్ కల్యాణ్ కు, ఇతర ఏపీ మంత్రివర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో, తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా చంద్రబాబు, పవన్ లకు విషెస్ తెలియజేవారు.
కేంద్రమంత్రులు ఎస్.జైశంకర్, కిషన్ రెడ్డి, టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. మీ భవిష్యత్ దార్శనిక విధానాలతో తరతరాల వారికి స్ఫూర్తిగా ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తారు అంటూ దేవిశ్రీ ప్రసాద్ కొనియాడారు. రాష్ట్రానికి వన్నె తెస్తారని, మీ కఠోర శ్రమకు ముగింపే లేదని పేర్కొన్నారు.