సీఎం హోదాలో ఇవాళ సాయంత్రం తిరుమలకు చంద్రబాబు

  • కుటుంబంతో కలిసి వెళ్లనున్న టీడీపీ అధినేత
  • బుధవారం రాత్రి అక్కడే బస.. గురువారం ఉదయం శ్రీవారి దర్శనం
  • రేపు తిరిగి అమరావతి చేరుకోనున్న చంద్రబాబు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (బుధవారం) సాయంత్రం ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తిరుమల వెళ్లనున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళుతున్నారు. సాయంత్రం 6.45 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి 7.45 గంటలకు రేణిగుంట చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాత్రి 8.50 గంటలకు తిరుమల చేరుకుంటారు. రాత్రి ఆయన అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం 7.30 గంటల నుంచి 8 మధ్య శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు దర్శించుకోనున్నారు. దర్శనం అనంతరం బయలుదేరి అమరావతి చేరుకోనున్నారు.

కాగా ఈరోజు ఉదయం 11.27 గంటకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. నాలుగవ సారి సీఎంగా ఆయన ప్రమాణం చేయనున్నారు. కాగా 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1980 నుంచి 1983 వరకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా తొలిసారి చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. 1999లో రెండోసారి, 2014-19 వరకు మూడోసారి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇక 2004 నుంచి 2014 వరకు, 2019-2024 వరకు ఉమ్మడి ఏపీలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరించారు.


More Telugu News