ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ

  • పలువురి పేర్లను పరిశీలించిన అనంతరం మాఝీ పేరును ఖరారు చేసిన బీజేపీ
  • కియోంజర్ నుంచి 87 వేల పైచిలుకు మెజార్టీతో గెలిచిన మోహన్ చరణ్ మాఝీ
  • ఉపముఖ్యమంత్రులుగా ఇద్దరికి అవకాశం?
ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ పేరును బీజేపీ ఖరారు చేసింది. ఒడిశాలో 24 ఏళ్ల బీజేడీ విజయపరంపరకు బీజేపీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గండికొట్టింది. ఫలితాల తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి ఎంపిక వేటలో పడింది. పలువురి పేర్లను పరిశీలించిన అనంతరం మోహన్ మాఝీ పేరును ఈరోజు ఖరారు చేసింది. ఈయన కియోంజర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 87 వేల పై చిలుకు మెజార్టీతో గెలిచారు.

కనక్ వర్ధన్ సింగ్, ప్రవతి పరిడాలను ఉపముఖ్యమంత్రులుగా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ప్రవతి పరిడా నిమపర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. బీజేపీ, బీజేడీ అలయెన్స్‌లో 2000 నుంచి 2004 వరకు ప్రభుత్వం కొనసాగింది. ఆ తర్వాత బీజేడీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. ఇప్పుడు బీజేపీ మొదటిసారి అధికారంలోకి వచ్చింది.


More Telugu News