అభివృద్ధిని సమష్టిగా ముందుకు తీసుకెళ్లాలి: పవన్ కల్యాణ్
- రాష్ట్ర ప్రజలు కూటమికి అద్భుత మెజారిటీ ఇచ్చారన్న పవన్
- 5 కోట్ల మంది ప్రజలు మన పాలనపై ఆశలు పెట్టుకున్నారని వివరణ
- కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదని వ్యాఖ్య
రాష్ట్రంలో అభివృద్ధిని సమష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 175 సీట్లకుగాను అద్భుత మెజారిటీతో 164 సీట్లలో విజయం సాధించిందని, అలాగే లోక్ సభ ఎన్నికల్లోనూ 25 సీట్లకుగాను 21 ఎంపీ స్థానాలను కూటమి గెలుచుకుందని చెప్పారు.
మంగళవారం విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో కూటమి శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కూటమి విజయం యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని వ్యాఖ్యానించారు. కూటమి అంటే ఎలా ఉండాలో, ఎలా పనిచేయాలో కలసికట్టుగా చూపించామని చెప్పారు. రాష్ర్టంలోని 5 కోట్ల మంది ప్రజలు కూటమి మంచి పాలన అందిస్తుందని నమ్మకం పెట్టుకున్నారని జనసేనాని గుర్తుచేశారు. అందువల్ల కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదని సూచించారు.