కంగనా రనౌత్‌కు చెంపదెబ్బ అంశంపై స్పందించిన పంజాబ్ సీఎం
- కంగన గతంలో మాటలాడిన మాటలే కానిస్టేబుల్ ఆగ్రహానికి కారణమని వ్యాఖ్య
- ఇలా జరిగి ఉండాల్సింది కాదన్న భగవంత్ మాన్
- పబ్లిక్ ఫిగర్ అయి ఉండి కంగనా అలా మాట్లాడటం సరికాదని వ్యాఖ్య
కంగనా రనౌత్ గతంలో మాట్లాడిన మాటల నేపథ్యంలో కోపంలోనే సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఆమె చెంపపై కొట్టారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. కంగనా రనౌత్‌పై చెంప దెబ్బ ఘటనపై ఆయన మొదటిసారి పెదవి విప్పారు.
'అది (కంగనకు చెంపదెబ్బ) కోపం. ఆమె గతంలో మాట్లాడిన మాటలు ఆ అమ్మాయి (సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్)ని ఆగ్రహానికి గురి చేశాయి. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. కంగనా అలా మాట్లాడటం తప్పు. ఒక నటి... పబ్లిక్ ఫిగర్... ఎంపీ అయి ఉండి పంజాబే ఉగ్రవాద రాష్ట్రం అనడం సరికాదు' అని పంజాబ్ సీఎం అన్నారు.
జూన్ 6న కంగనా రనౌత్ చండీగఢ్ విమానాశ్రయంలో సెక్యూరిటీ చెక్‌కు వెళ్లినప్పుడు అక్కడున్న సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమె చెంపపై కొట్టింది. రైతుల పోరాటంలో తన తల్లి పాల్గొందని, అలాంటి పోరాటాన్ని కించపరిచినందుకు కంగనను కొట్టినట్లు కుల్విందర్ కౌర్ చెప్పారు.