కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులకు శాఖల కేటాయింపు... బీజేపీ నేతలకే కీలక శాఖలు!
- సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం
- నిన్న ప్రమాణస్వీకారం చేసిన మోదీ, ఇతర క్యాబినెట్ సహచరులు
- నేడు శాఖల కేటాయింపు
- పాత శాఖలను నిలబెట్టుకున్న సీనియర్లు
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడం, నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా నిన్న ప్రమాణస్వీకారం చేయడం తెలిసిందే. మోదీతో పాటు మంత్రులు, సహాయమంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ వారికి శాఖలు కేటాయించారు.
చాలామంది సీనియర్లు క్యాబినెట్ లో స్థానం నిలుపుకున్నారు. పలువురికి పాత శాఖలే కేటాయించారు. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ వంటి వారు తమ పాత శాఖలనే తిరిగి పొందారు.
మంత్రులు... వారికి కేటాయించిన శాఖలు
సహాయ మంత్రులు...
చాలామంది సీనియర్లు క్యాబినెట్ లో స్థానం నిలుపుకున్నారు. పలువురికి పాత శాఖలే కేటాయించారు. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ వంటి వారు తమ పాత శాఖలనే తిరిగి పొందారు.
మంత్రులు... వారికి కేటాయించిన శాఖలు
- శివరాజ్ సింగ్ చౌహాన్- వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి
- సర్బానంద సోనోవాల్- పోర్టులు, షిప్పింగ్, జలమార్గాలు
- హర్ దీప్ సింగ్ పూరి- పెట్రోలియం, సహజవాయువు
- రాజ్ నాథ్ సింగ్- రక్షణ శాఖ
- అమిత్ షా- హోం శాఖ
- జై శంకర్- విదేశీ వ్యవహారాలు
- ధర్మేంద్ర ప్రధాన్- విద్యాశాఖ, మానవ వనరులు
- నితిన్ గడ్కరీ- రోడ్డు రవాణా శాఖ, జాతీయ రహ
- నిర్మలా సీతారామన్- ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాలు
- జేపీ నడ్డా- వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమం, రసాయనాలు
- అన్నపూర్ణాదేవి- మహిళా శిశు సంక్షేమం
- పియూష్ గోయల్- వాణిజ్యం
- మనోహర్ లాల్ ఖట్టర్- విద్యుత్ శాఖ
- మన్సుఖ్ మాండవీయ- క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖ, యువజన సర్వీసులు
- రాజీవ్ రతన్- పంచాయతీరాజ్, మత్స్య శాఖ, పాడి పరిశ్రమ
- చిరాగ్ పాశ్వాన్- ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు
- కిరణ్ రిజిజు- పార్లమెంటరీ వ్యవహారాలు
- గజేంద్ర సింగ్ షెకావత్- టూరిజం, సాంస్కృతిక శాఖ
- జ్యోతిరాదిత్య సింథియా- టెలికాం, ఈశాన్య రాష్ట్రాల శాఖ
- సీఆర్ పాటిల్- జలశక్తి
- కిషన్ రెడ్డి- బొగ్గు గనులు
- భూపీంద్ర యాదవ్- పర్యావరణం
- అశ్విని వైష్ణవ్- రైల్వే, సమాచార ప్రసార
- రామ్మోహన్ నాయుడు- పౌర విమానయాన శాఖ
- కుమారస్వామి- భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ
- గిరిరాజ్ సింగ్- జౌళి శాఖ
- జ్యుయెల్ ఓరం- గిరిజన వ్యవహారాల
- వీరేంద్ర కుమార్- సామాజిక న్యాయం, సాధికారత
- ప్రహ్లాద్ జోషి- ఆహారం, వినియోగదారుల సేవలు
- జితిన్ రామ్ మాంఝీ- సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ
సహాయ మంత్రులు...
- హర్ష్ మల్హోత్రా- రోడ్డు రవాణా శాఖ
- అజయ్ తమ్తా- రోడ్డు రవాణా
- శోభ కరంద్లాజే- చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ
- సురేశ్ గోపి- టూరిజం శాఖ
- రావ్ ఇంద్రజిత్ సింగ్- టూరిజం, సాంస్కృతిక శాఖ
- శ్రీనివాసవర్మ- భారీ పరిశ్రమల శాఖ
- బండి సంజయ్- హోంశాఖ
- పెమ్మసాని చంద్రశేఖర్- గ్రామీణాభివృద్ధి శాఖ, కమ్యూనికేషన్లు
- జితేంద్ర సింగ్- శాస్త్ర సాంకేతిక శాఖ
- అర్జున్ రామ్ మేఘ్వాల్- లా అండ్ జస్టిస్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
- జాదవ్ ప్రతాప్ రావ్ గణ్ పత్ రావ్- ఆయుష్ శాఖ, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
- జయంత్ చౌదరి- స్కిల్ డెవలప్ మెంట్ శాఖ, విద్యాశాఖ
- జితిన్ ప్రసాద- వాణిజ్యం, పరిశ్రమల శాఖ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ
- శ్రీపాద్ యశో నాయక్- విద్యుత్ శాఖ, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ
- పంకజ్ చౌదరి- ఆర్థిక శాఖ
- కృష్ణన్ పాల్- సహకార శాఖ
- రామదాస్ అథ్వాలే- సామాజిక న్యాయం, సాధికారత శాఖ
- రామ్ నాథ్ ఠాకూర్- వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ
- నిత్యానంద్ రాయ్- హోంశాఖ
- అనుప్రియ పటేల్- వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రసాయనాలు, ఎరువుల శాఖ
- వి.సోమన్న- జలశక్తి శాఖ, రైల్వే శాఖ
- ఎస్పీ సింగ్ బఘేల్- మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, పంచాయతీరాజ్ శాఖ
- కీర్తివర్ధన్ సింగ్- పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ
- బీఎల్ వర్మ- వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, సామాజిక న్యాయం, సాధికారత శాఖ
- శంతను ఠాకూర్- పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ
- డాక్టర్ ఎల్.మురుగన్- సమాచార, ప్రసార శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
- కమలేశ్ పాశ్వాన్- గ్రామీణాభివృద్ధి శాఖ
- భగీరథ్ చౌదరి- వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ
- సతీశ్ చంద్ర దూబే- బొగ్గు శాఖ, గనుల శాఖ
- సంజయ్ సేథ్- రక్షణ శాఖ
- రవనీత్ సింగ్- ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ, రైల్వే శాఖ
- దుర్గాదాస్ ఉయికే- గిరిజన వ్యవహారాలు
- రక్షా నిఖిల్ ఖడ్సే- క్రీడలు, యువజన వ్యవహారాలు
- సుకాంత మజుందార్- విద్యాశాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ
- సావిత్రి ఠాకూర్- మహిళా శిశు సంక్షేమ శాఖ
- టోఖాన్ సాహు- గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ
- నిమూ బెన్ జయంతి భాయ్ బంభానియా- సహకార శాఖ, పౌర విమానయాన శాఖ
- జార్జి కురియన్- మైనారిటీ వ్యవహారాలు, మత్స్యశాఖ, పశు సంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ
- పబిత్ర మార్గరీటా- విదేశీ వ్యవహారాల శాఖ, టెక్స్ టైల్స్ శాఖ