మోదీ అధ్యక్షతన తొలిసారి కేబినెట్ భేటీ

  • పీఎంఏవై కింద 3 కోట్ల ఇళ్లు నిర్మించేందుకు కేబినెట్ ఆమోదం
  • మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక తొలి కేబినెట్ భేటీ
  • లోక్ కల్యాణ్ మార్గ్‌లోని మోదీ నివాసంలో సమావేశం
ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్రమంత్రివర్గం సోమవారం సమావేశమైంది. పీఎంఏవై కింద మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించేందుకు తొలి కేబినెట్ భేటీ ఆమోదం తెలిపింది. నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని అయ్యాక లోక్ కల్యాణ్ మార్గ్‌లోని మోదీ నివాసంలో కేబినెట్ తొలిసారి సమావేశమైంది. ఈ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అంతకుముందు, రైతులకు సంబంధించి పీఎం కిసాన్ నిధి విడుదల దస్త్రంపై మోదీ తొలి సంతకం చేశారు. దీంతో 9.3 కోట్ల మంది రైతులకు రూ.20 వేల కోట్ల ఆర్థిక సహాయం అందనుంది. కేబినెట్ భేటీకి ముందు పీఎంవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.


More Telugu News