నన్ను కలవడానికి వచ్చే మిత్రులు ఇవి తీసుకు రండి ప్లీజ్: కిషన్ రెడ్డి
- తాజాగా కొలువుదీరిన మోదీ కేబినెట్‌లో కిషన్ రెడ్డికి చోటు
- దీంతో అభినందనలు తెలుపుతూ పలువురు ఆయనను కలుస్తున్న వైనం
- ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా తనను కలవడానికి వచ్చే వారికి మంత్రి ప్రత్యేక అభ్యర్థన
- పూల బొకేలు, శాలువాలు, స్వీట్లకు బదులు విద్యార్థులకు నోట్‌బుక్‌లు తీసుకురావాలని విజ్ఞప్తి
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి ఆదివారం కొలువుదీరిన మోదీ మంత్రివర్గంలో చోటు దక్కిన విషయం తెలిసిందే. దీంతో కిషన్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ పలువురు ఆయనను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన తనను కలవడానికి వచ్చేవారికి ప్రత్యేక అభ్యర్థన చేశారు.
"నన్ను కలవడానికి వచ్చే మిత్రులు & శ్రేయోభిలాషులందరికీ నా వినమ్రపూర్వకమైన అభ్యర్థన. దయచేసి పూల బొకేలు, శాలువాలు, స్వీట్లు తీసుకురావొద్దు. వాటి బదులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోట్‌బుక్‌లు లేదా స్ఫూర్తిదాయకమైన కథల పుస్తకాలు తీసుకురాగలరని మనవి" అంటూ కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.