కేంద్ర సహాయమంత్రి పదవికి రాజీనామా వార్తలు... కొట్టిపారేసిన సురేశ్ గోపి
- కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయన్న సురేశ్ గోపి
- కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్య
- కేరళ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్న సురేశ్ గోపి
తాను కేంద్ర సహాయమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని నటుడు సురేశ్ గోపి ఆవేదన వ్యక్తం చేశారు. త్రిస్సూర్ నుంచి గెలిచిన సురేశ్ గోపి నిన్న కేంద్ర సహాయమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే బిజీ సినిమా షెడ్యూల్ కారణంగా పదవి నుంచి తప్పుకోవాలనుకున్నట్లు సురేశ్ గోపి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఆయన ఖండించారు.
కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేరళ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. కేరళ నుంచి ప్రాతినిథ్యం వహించడం, మోదీ కేబినెట్లో తనకు చోటు దక్కడం గర్వకారణంగా భావిస్తున్నట్లు చెప్పారు.