టీమిండియా జెర్సీలో మైక్రోసాఫ్ట్ బాస్.. ఇండో-పాక్ మ్యాచ్ వీక్షించిన సత్య నాదెళ్ల!
- న్యూయార్క్ వేదికగా దాయాదుల పోరు
- ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల
- వ్యాపారవేత్త గౌరవ్ జెయిన్‌తో మైక్రోసాఫ్ట్ బాస్ సెల్ఫీ
- సోషల్ మీడియాలో సత్య నాదెళ్ల ఫొటోలు వైరల్
- తమదైన శైలిలో స్పందిస్తున్న నెటిజన్లు
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం న్యూయార్క్ వేదికగా జరిగిన దాయాదుల పోరును మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న సత్య నాదెళ్ల .. ప్రముఖ వ్యాపారవేత్త గౌరవ్ జెయిన్‌తో సెల్ఫీ దిగారు. ఇండియన్ జెర్సీ ధరించిన మైక్రోసాఫ్ట్ సీఈఓ.. మ్యాచ్‌ను ఫుల్ ఎంజాయ్ చేశారు. క్రికెట్ అభిమానులతో కలిసి సత్య నాదెళ్ల దిగిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆయన ఫొటోకు 'ఎక్స్' (ట్విట్టర్) లో లక్షల వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
కాగా, గతంలో క్రికెట్ పట్ల తనకు ఉన్న ఇష్టాన్ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వెల్లడించారు. టీమ్ వర్క్, లీడర్‌షిప్ వంటి వాటిని క్రీడల నుంచే నేర్చుకున్నట్లు తెలిపారు. క్రికెట్ ఆడడం వల్ల టీమ్‌లతో వర్క్ చేయడం నేర్చుకున్నట్లు గుర్తు చేశారు.
ఇక న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆరు పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 120 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దాయాది పాకిస్థాన్ అనూహ్య రీతిలో పరాజయం పాలైంది.