వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలో చేరాలని చూస్తున్నారు: ఆదినారాయణరెడ్డి
- ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించిన జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే
- రైతుల ఉద్యమ శిబిరాలను సందర్శించిన ఆదినారాయణరెడ్డి
- త్వరలోనే వైసీపీ భూస్థాపితం అవుతుందని వ్యాఖ్యలు
- వైసీపీ వాళ్లను బీజేపీలో చేర్చుకోబోమని స్పష్టీకరణ
జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఇవాళ ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో రైతుల ఉద్యమ శిబిరాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలో చేరాలని చూస్తున్నారని తెలిపారు. అయితే, వైసీపీ వాళ్లను బీజేపీలో చేర్చుకోబోమని స్పష్టం చేశారు. వైసీపీ త్వరలోనే భూస్థాపితం అవుతుందని ఆదినారాయణరెడ్డి అన్నారు.
ఎన్నికల్లో జగన్ ఓటమికి అమరావతి ఉద్యమం కూడా ఓ కారణమని అభిప్రాయపడ్డారు. రాజధానిని తరలించాలని చూసిన జగన్ కు ప్రజలే బుద్ధిచెప్పారని అన్నారు.
గత ఎన్నికల్లో వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను గెలవగా... ఈసారి ఘోరంగా 11 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు మాత్రమే గెలిచారు.