వైసీపీకి గుడ్ బై చెప్పిన నెల్లూరు మేయర్ స్రవంతి

  • తాము ఈ స్థాయిలో ఉండడానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కారణమన్న స్రవంతి దంపతులు 
  • గతంలో తాము ఆయన వెంట టీడీపీలోకి వెళ్లలేకపోయామని విచారం
  • ఇప్పుడు కోటంరెడ్డి తమను అక్కున చేర్చుకోవాలని స్రవంతి విజ్ఞప్తి
నెల్లూరు మేయర్ స్రవంతి, ఆమె భర్త పొట్లూరి జయవర్ధన్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా స్రవంతి మీడియాతో మాట్లాడారు. తాము రాజకీయాల్లో ఈ స్థాయిలో ఉన్నామంటే అందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కారణమని వెల్లడించారు. తనకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని, కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్పొరేటర్ గా అవకాశం ఇచ్చి రాజకీయాల్లో ప్రోత్సహించారని తెలిపారు. 

శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడినప్పుడు, కొన్ని ఒత్తిళ్ల కారణంగా తాము ఆయన వెంట నడవలేకపోయామని స్రవంతి విచారం వ్యక్తం చేశారు. అయినప్పటికీ శ్రీధర్ రెడ్డి తమను పల్లెత్తు మాట అనలేదని పేర్కొన్నారు. జరిగిన విషయాలను పెద్ద మనసుతో మన్నించి, తమను అక్కున చేర్చుకోవాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.


More Telugu News