రేపు చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్న కూటమి ఎమ్మెల్యేలు
- ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన కూటమి
- మొత్తం 175 స్థానాలకు 164 స్థానాలు గెలిచిన కూటమి
- జూన్ 12న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
- రేపు గవర్నర్ కు లేఖ అందించనున్న కూటమి ఎమ్మెల్యేలు
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి చరిత్రలో నిలిచిపోయే విజయం సాధించడం తెలిసిందే. ఏపీలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 175 కాగా... కూటమి ప్రభంజనం సృష్టిస్తూ ఏకంగా 164 స్థానాల్లో జయభేరి మోగించింది. టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో గెలిచాయి.
ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు జూన్ 12న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి ముందుగా, రేపు (జూన్ 11) చంద్రబాబును కూటమి ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు.
కూటమి తరఫున గెలిచిన 164 మంది ఎమ్మెల్యేలు రేపు విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో సమావేశం కానున్నారు. ఈ కీలక భేటీ ఉదయం 9.30 గంటలకు జరగనుంది. చంద్రబాబును కూటమి నేతగా ఎన్నుకున్న అనంతరం... ఎమ్మెల్యేలు ఆ మేరకు గవర్నర్ కు లేఖ అందజేయనున్నారు.
ఈ లాంఛనం ముగిసిన అనంతరం, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చంద్రబాబును గవర్నర్ కోరనున్నారు.