జమ్మూ ఉగ్రదాడి వెనక పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా
- నిన్న యాత్రికుల బస్సులపై ఉగ్రవాదుల కాల్పులు
- బస్సు లోయలో పడడంతో 9 మంది మృతి.. 33 మందికి గాయాలు
- కాల్పుల బాధ్యత తమదేనని ప్రకటించిన ఎల్ఈటీ
జమ్మూలోని రియాసిలో ఆదివారం జరిగిన ఉగ్రదాడి వెనక పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా (ఎల్ఈటీ) వుందని తేలింది. వైష్ణోదేవి ఆలయ సందర్శనకు వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో బస్సు లోయలో పడడంతో 9 మంది మరణించగా, మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనకు పాల్పడింది తామేనని లష్కరే తాయిబాకు చెందిన టీఆర్ఎఫ్ ప్రకటించింది. ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం. దాదాపు డజను మంది ఉగ్రవాదులు రెండుమూడు గ్రూపులుగా విడిపోయి రాజౌరి-పూంచ్ అటవీ ప్రాంతంలోకి చొరబడ్డారు.
వీరిలో పాకిస్థాన్ జాతీయులు కూడా ఉన్నారు. వారే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. పూంచ్-రాజౌరి సెక్టార్‌లో గత ఐదేళ్లుగా భద్రతా దళాలు-సైన్యం మధ్య తరచూ కాల్పులు జరుగుతున్నాయి.