వర్షాకాలం వచ్చేసింది.. వాహనదారులూ జాగ్రత్త: తెలంగాణ డీజీపీ

  • ఇంజిన్ కండిషన్, బ్రేక్, టైర్లలో గాలి చెక్ చేసుకోవాలన్న డీజీపీ 
  • వర్షం కురుస్తుంటే పరిమిత వేగంతో వెళ్లాలని సూచన
  • ఎమర్జెన్సీలో 100 కు ఫోన్ చేస్తే వెంటనే సాయం
వర్షాకాలంలో వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ డీజీపీ సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. వాహనాల కండిషన్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, పరిమిత వేగంతో జాగ్రత్తగా ప్రయాణించాలని చెప్పారు. ఈ సీజన్ లో డ్రైవింగ్ చేసే ముందు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి డీజీపీ చేసిన సూచనలు ఇవే..

  • వాహనం టైర్ల గ్రిప్/థ్రెడ్ ను సంబంధిత నిపుణులతో చెక్ చేయించాలి. గ్రిప్ బాగోలేకపోతే వెంటనే టైర్లను మార్చుకోవాలి.
  • టైర్ల గాలిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.
  • వర్షంలో ప్రయాణిస్తున్నపుడు పరిమిత వేగంతో వెళ్లడం మంచిది.
  • వాహనం ఇంజిన్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి.
  • బ్రేక్స్ పాడ్స్,  విండ్ స్క్రీన్ వైపర్ల కండిషన్ ఒకటికి రెండు సార్లు చెక్ చేయించడం మేలు.
  • వాహనాల్లో ఎమర్జెన్సీ కిట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
  • అత్యవసర సమయాల్లో #Dial100 కి కాల్ చేసేలా మొబైల్/ వాహనంలో స్పీడ్ డయల్ ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల వెంటనే సాయం అందే వీలుంటుంది.


More Telugu News