టీ20 ప్రపంచకప్: భారత్ చేతిలో ఓటమితో పాక్ ఆటగాడి కన్నీళ్లు
- నాలుగు బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన నసీమ్ షా
- క్రీజులో ఉన్నప్పటికీ గెలిపించలేకపోయినందుకు ఆవేదన
- షహీన్ అఫ్రిదీతో కలిసి పెవిలియన్‌కు వెళ్తూ కన్నీళ్లు
టీ20 ప్రపంచకప్‌లో భారత్ చేతిలో ఓటమి పాలైన తర్వాత పాక్ ఆటగాడు నసీమ్ షా కన్నీళ్లు పెట్టుకున్నాడు. చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాక్ జట్లు గతరాత్రి న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే 119 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత్ పరాజయం ఖాయమనుకున్న వేళ టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విజృంభించి మూడు వికెట్లు తీసి పాక్‌ను దారుణంగా దెబ్బతీశాడు. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అంతకుముందు పాక్ బౌలర్ నసీమ్ షా మూడు వికెట్లు పడగొట్టి భారత జట్టు భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. విజయం అందినట్టే అంది చేజారడంతో స్టేడియంలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. క్రీజులో ఉన్నప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయినందుకు తట్టుకోలేకపోయాడు. షహీన్ అఫ్రిదితో కలిసి పెవిలియన్‌కు తిరిగి వెళ్తూ కన్నీరు పెట్టుకున్నాడు. షహీన్ అతడిని ఓదార్చాడు. నాలుగు బంతులు ఆడిన నసీమ్ 2 ఫోర్లతో 10 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.