గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలోని వ్యాయామశాలకు వైసీపీ శిలాఫలకాలు.. ధ్వంసం చేసిన వాకర్స్
- స్టేడియంలో నూతన జిమ్ భవనం నిర్మించి వైఎస్సార్ పేరు
- శిలాఫలకాలు ధ్వంసం చేసి ఎన్టీఆర్ పేరు ఏర్పాటు చేసిన వైనం
- భవన నిర్మాణం విషయంలో అవినీతి జరిగిందన్న బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్‌శర్మ
గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న నూతన వ్యాయామశాలకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలకాలను నిన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వాకర్స్ ధ్వంసం చేశారు. అనంతరం నూతన భవనానికి ఎన్టీఆర్ జిమ్ పేరుతో బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు, బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌శర్మ మాట్లాడుతూ అధికారం చేతిలో ఉందని విర్రవీగిన వైసీపీ నాయకులు గత చంద్రబాబు నిర్మించిన భవనాలకు ఉన్న ఎన్టీఆర్ పేర్లను మార్చి వైఎస్సార్ పేర్లు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ స్టేడియంలోని జిమ్ వ్యాయామ పరికరాలు పాడైపోతే కొత్తవి పెట్టడం మానేసి, కమీషన్లకు కక్కుర్తిపడి కోట్ల రూపాయలతో వ్యాయామశాలను నిర్మించి దానికి వైఎస్సార్ అని పేరు పెట్టుకున్నారని విమర్శించారు. దీనిపై తాము హైకోర్టుకు కూడా వెళ్లినట్టు తెలిపారు. కేసు పెండింగులో ఉండగానే వైసీపీ నేతల పేర్లతో శిలాఫలకాలు వేశారని మండిపడ్డారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.