ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్.. జాతీయ మీడియాతో పవన్ చెప్పింది ఇదేనా?

  • మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న పవన్
  • ‘ఇండియాటుడే’తో మాట్లాడుతూ మనసులో మాట బయటపెట్టిన పవన్
  • కేబినెట్ కూర్పుపై ఇప్పటికే బాబుతో చర్చలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏర్పడబోయే ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర పోషించనున్నారనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఎన్నికల్లో కూటమి విజయం సాధించగానే పవన్ డిప్యూటీ సీఎం అవుతారన్న చర్చ మొదలైంది.  అయితే, ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు.

తాజాగా, ఈ విషయంలో పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చినట్టు జాతీయ చానల్ ‘ఇండియా టుడే’ పేర్కొంది. నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీ వెళ్లిన పవన్‌ను ఆ చానల్ ప్రతినిధి ఇంటర్వ్యూ చేశారు. అనంతరం ఆ రిపోర్టర్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వంలో చేరేందుకు పవన్ ఆసక్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ టీవీ స్క్రోలింగ్‌లో పవన్ డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. దీనిని బట్టి పదవి విషయంలో పవన్ పూర్తి స్పష్టతతో ఉన్నట్టు అర్థమవుతోంది. కాగా, క్యాబినెట్ కూర్పుపై ఇప్పటికే చంద్రబాబు, పవన్ చర్చించినట్టు వార్తలు బయటకు వచ్చాయి.


More Telugu News