మోదీ మంత్రివర్గంలో తిరిగి చోటు దక్కని ప్రముఖులు వీరే
- 37 మంది మాజీలకు మళ్లీ దక్కని చోటు
- చోటు కోల్పోయిన వారిలో ఏడుగురు మాజీ కేబినెట్, 30 మంది మాజీ సహాయమంత్రులు
- మంత్రి పదవి మిస్సైన వారిలో 18 మంది ఎన్నికల్లో ఓడినవారే
గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన 37 మంది ప్రస్తుత కేంద్ర మంత్రివర్గంలో చోటుకోల్పోయారు. వీరిలో ఏడుగురు మాజీ కేబినెట్ ర్యాంకు మంత్రులు కాగా, మిగిలిన 30 మంది మాజీ సహాయమంత్రులు. స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, నారాయణ్ రాణె, పరుషోత్తం రూపాల, అర్జున్ ముండ, ఆర్‌కే సింగ్, మహేంద్రనాథ్ పాండే గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేశారు. వీరెవరికీ ప్రస్తుత మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. ఈసారి పదవిని కోల్పోయిన వారిలో 18 మంది ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన వారే. గత ప్రభుత్వంలో సహాయమంత్రిగా ఉండి, లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పదవి నిలబెట్టుకున్న ఏకైక నేత ఎల్. మురుగన్
మంత్రివర్గంలో చోటుదక్కని వారు వీరే
వీకే సింగ్, ఫగ్గణ్ సింగ్ కులస్తే, అశ్వినీ చౌబే, దన్వే రావ్‌సాహెబ్ దాదారావ్, సాధ్వీ నిరంజన్ జ్యోతి, సంజీవ్ బల్యాన్, రాజీవ్ చంద్రశేఖర్, సుభాష్ సర్కార్, నిశిత్ ప్రమాణిక్, రాజ్‌కుమార్ రంజన్ సింగ్, ప్రతిమా భౌమిక్, మీనాక్షి లేఖి, ముంపపరా మహేంద్రభాయ్, అజయ్ కుమార్ మిశ్ర, కైలాశ్ చౌధరీ, కపిల్ మోరేశ్వర్ పాటిల్, భారతీ ప్రవీణ్ కుమార్, కౌశల్ కిశోర్, భగవంత్ ఖుభా, వి. మురళీధరన్, భాను ప్రతాప్‌సింగ్ వర్మ, జాన్ బార్లా, బిశ్వేశ్వర్ టుడు, భగవత్ కిషన్ రావ్ కరాడ్, దేవుసిన్హ్ చౌహాన్, అజయ్ భట్, ఎ.నారాయణ స్వామి, సోమ్ ప్రకాశ్, రామేశ్వర్ లేలి, దర్శనా విక్రమ్ జర్దోశ్.