భారత్ చేతిలో ఓడిన పాక్‌కు బిగ్ షాక్.. మారిపోయిన సూపర్-8 సమీకరణాలు
- భారత్ చేతిలో ఓటమితో సంక్లిష్టంగా మారిన పాక్ సూపర్-8 అవకాశాలు
- ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన దాయాది దేశం
- చెరో రెండు మ్యాచ్‌లు గెలిచి గ్రూప్-ఏలో టాప్-2లో నిలిచిన భారత్, అమెరికా
- పాక్ సూపర్-8 చేరుకోవాలంటే కీలకం కానున్న పలు సమీకరణాలు
అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2024లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం జరిగిన అత్యంత ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో భారత్ చేతిలో పాక్ 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఆ జట్టుకు టోర్నీలో వరుసగా రెండవ ఓటమి ఎదురైంది. తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో సంచలనాత్మక రీతిలో దాయాది దేశం ఓడిపోయిన విషయం తెలిసిందే. ఫలితంగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడంతో ఆ జట్టు సూపర్-8 దశ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
పాక్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడంతో ఆ జట్టు ఖాతాలో ఒక్క పాయింట్ కూడా లేదు. దీంతో ప్లే ఆఫ్ అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సూపర్-8 రేసులో సమీకరణాలు పాక్ కు అనుకూలంగా మారాలంటే.. దాయాది దేశం మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. కెనడా, ఐర్లాండ్‌లపై విజయాలు సాధించాలి. ఇదే సమయంలో అమెరికా, కెనడా జట్లు తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి.
ఒకవేళ పాకిస్థాన్ మిగిలిన 2 మ్యాచ్‌ల్లో గెలిచి.. అమెరికా మిగిలిన 2 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైతే రెండు జట్లు చెరో 4 పాయింట్లతో సూపర్-8 రేసులో నిలుస్తాయి. అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకునే జట్టు అర్హతను నిర్ణయిస్తారు. మొత్తంగా చూస్తే భారత్ చేతిలో ఓడిపోయాక పాకిస్థాన్ సూపర్-8 అవకాశాలు అత్యంత సంక్లిష్టంగా మారాయి.