ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయండి... భారత్-పాక్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంపై బ్యానర్ తో ఎగిరిన విమానం
- టీ20 వరల్డ్ కప్ లో నేడు భారత్ × పాకిస్థాన్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్
- 5 ఓవర్లలో 2 వికెట్లకు 38 పరుగులు చేసిన భారత్
- మ్యాచ్ వేళ అందరి దృష్టిని ఆకర్షించిన చిన్న విమానం
ఇవాళ న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో ఓ విమానం స్టేడియంపై ఎగిరింది. ఆ విమానం ఓ బ్యానర్ ను ప్రదర్శిస్తూ వెళ్లింది. ఆ బ్యానర్ పై ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయండి (Release Imran Khan) అని రాసి ఉంది.
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. భారత్-పాక్ మ్యాచ్ పై ప్రపంచవ్యాప్త ఆసక్తి ఉంటుంది కాబట్టి, ఇలాంటి వేళ ఇమ్రాన్ ఖాన్ అంశాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లాలన్నది ఆ స్లోగన్ సృష్టికర్తల ఉద్దేశంగా కనిపిస్తోంది.
ఇక దాయాదుల మ్యాచ్ విషయానికొస్తే... టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు 50 పరుగులు చేసింది. ప్రస్తుతం అక్షర్ పటేల్ 15, రిషబ్ పంత్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. విరాట్ కోహ్లీ 4, కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులు చేసి అవుటయ్యారు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 1, నసీమ్ షా 1 వికెట్ తీశారు.