కేంద్ర సహాయమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన టీడీపీ ఎంపీ పెమ్మసాని
- రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలిసారే ఎంపీగా నెగ్గిన పెమ్మసాని
- గుంటూరు టీడీపీ ఎంపీగా ఘనవిజయం
- గెలిచిన వెంటనే కేంద్ర క్యాబినెట్ లో చోటు
- నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం
తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ను బంపర్ చాన్స్ వరించిన సంగతి తెలిసిందే. ఆయన ఎంపీగా గెలవడం ఇదే తొలి పర్యాయం కాగా, గెలిచిన వెంటనే కేంద్ర క్యాబినెట్లోనూ చోటు దొరికింది. ఎన్డీయే 3.0 మంత్రివర్గంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ను కేంద్ర సహాయమంత్రి పదవి వరించింది.
ఇవాళ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో పెమ్మసాని కేంద్ర సహాయమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. భారత రాజ్యాంగానికి లోబడి రాగద్వేషాలకు అతీతంగా, బంధుప్రీతికి దూరంగా, ప్రజాప్రయోజనాలే పరమావధిగా కేంద్ర సహాయమంత్రిగా విధులు నిర్వర్తిస్తానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని ప్రమాణం చేశారు.