ఉగ్రవాదుల కాల్పులతో లోయలో పడిన భక్తుల బస్సు... 9 మంది మృతి
- నేడు కొలువుదీరుతున్న ఎన్డీయే ప్రభుత్వం
- జమ్మూ కశ్మీర్ లో ఉగ్ర ఘాతుకం
- ఉగ్రవాదుల కాల్పులతో లోయలో పడిపోయిన బస్సు
జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఇవాళ ఎన్డీయే ప్రభుత్వం మూడో పర్యాయం కొలువుదీరుతున్న తరుణంలో ఉగ్రవాదులు ఓ బస్సును లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. రియాసీ జిల్లాలోని శివఖోడి ఆలయానికి భక్తులు ఓ బస్సులో వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. 9 మంది భక్తులు మృతి చెందారు. అయితే, వారు బుల్లెట్ గాయాలతో చనిపోయారా, లేక బస్సు లోయలో పడడం వల్ల చనిపోయారా? అనే అంశంపై స్పష్టత లేదు. ఈ ఘటనలో 33 మందికి గాయాలయ్యాయి.
కాగా, ఘటన స్థలంలో అనేక ఖాళీ బుల్లెట్ షెల్స్ లభ్యమయ్యాయి.