కల్పనా సోరెన్ వచ్చేశారు... జాగ్రత్త: ఝార్ఖండ్ సీఎంకు బీజేపీ ఎంపీ హెచ్చరిక
- మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ అరెస్ట్
- సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంపాయీ సోరెన్
- ఉప ఎన్నికల్లో హేమంత్ భార్య కల్పన విజయం
- కల్పన వచ్చారు... జాగ్రత్త అంటూ బీజేపీ ఎంపీ హెచ్చరిక
సీఎం చంపాయి సోరెన్ గారూ, జాగ్రత్తగా ఉండండి... కల్పనా సోరెన్ వచ్చేశారంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఝార్ఖండ్ ముఖ్యమంత్రిని హెచ్చరించారు. మనీలాండరింగ్ కేసులో ఈ ఏడాది జనవరిలో మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారు. అప్పుడు ఆయన రాజీనామా చేయడంతో సతీమణి కల్పన సోరెన్‌కు అవకాశం దక్కుతుందని భావించారు. కానీ పార్టీ సీనియర్ నేత చంపాయి సోరెన్ ముఖ్యమంత్రి అయ్యారు.
అయితే, ఇటీవల గాండేయ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో హేమంత్ సోరెన్ భార్య కల్పానా సోరెన్ విజయం సాధించారు.
ఈ క్రమంలో బీజేపీ ఎంపీ నిషికాంత్ ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. చంపాయి సోరెన్ జాగ్రత్తగా ఉండండి... కల్పనా సోరెన్ వచ్చేశారని ఆయన పేర్కొన్నారు. రానున్న వారం రోజులు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమైనవి అన్నారు. తద్వారా, మరికొన్నిరోజుల్లో జేఎంఎం పార్టీలో అంతర్గత కలహాలు మొదలవుతాయని పరోక్షంగా అన్నారు.