వరల్డ్ కప్ లో పాక్ పై భారత్ గెలవాలంటూ హోమాలు, పూజలు
- టీ20 వరల్డ్ కప్ కు ఆతిథ్యమిస్తున్న అమెరికా, వెస్టిండీస్ దేశాలు
- నేడు న్యూయార్క్ లో భారత్, పాక్ మ్యాచ్
- దాయాదుల సమరం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్లు నేడు టీ20 వరల్డ్ కప్ లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియంలో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
ఇక, టీమిండియా గెలవాలంటూ ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో అభిమానులు హోమాలు, పూజలు నిర్వహించారు. రోహిత్ సేన విజయాన్ని కాంక్షిస్తూ... వేదమంత్రాలు చదువుతూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ సందడి చేశారు.
టీ20 వరల్డ్ కప్ లో భారత్, పాకిస్థాన్ జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. భారత్ తాను ఆడిన తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ పై విజయం సాధించగా... పాకిస్థాన్ జట్టు పసికూన అమెరికా చేతిలో ఓటమిపాలైంది. దాంతో నేడు భారత్ తో మ్యాచ్ పాక్ కు ఎంతో కీలకం.