బండి సంజయ్‌కి కేంద్రమంత్రి పదవి... స్పందించిన భార్య అపర్ణ
- మోదీకి, కార్యకర్తలకు థ్యాంక్స్ చెప్పిన బండి అపర్ణ
- ఇది తమకు దక్కిన గొప్ప గౌరవమని వ్యాఖ్య
- మోదీ కేబినెట్లో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డితో పాటు సంజయ్‌కి చోటు
కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కేంద్రమంత్రి కాబోతున్నారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు మోదీ కేబినెట్లో చోటు దక్కింది. సంజయ్‌కి కేంద్ర కేబినెట్లో చోటు దక్కడంపై ఆయన భార్య బండి అపర్ణ స్పందించారు. తన భర్తకు కేంద్రమంత్రి పదవి వచ్చినందుకు ప్రధాని నరేంద్రమోదీతో పాటు బీజేపీ కార్యకర్తలందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇది తమకు దక్కిన గొప్ప గౌరవమన్నారు. తమను ఆశీర్వదించారని పేర్కొన్నారు. తన భర్త ప్రజల కోసం పోరాడినట్లు చెప్పారు.
బీజేపీ కార్యకర్తగా గర్విస్తున్నాను: ఎంపీ రక్షా ఖడ్సే
ఢిల్లీలోని మోదీ నివాసంలో టీ మీటింగ్‌కు రక్షా ఖడ్సే హాజరయ్యారు. ఆమె మహారాష్ట్రలోని రేవర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. రక్షా మాట్లాడుతూ... తాను సుదీర్ఘకాలం బీజేపీ కార్యకర్తగా పని చేశానన్నారు. ఇందుకు గర్విస్తున్నానని పేర్కొన్నారు. మోదీగారితో కలిసి పని చేసే అవకాశం రావడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. మనమంతా దేశం కోసం పని చేయాలని మోదీ పిలుపునిచ్చారన్నారు.