దాయాదుల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్‌కు సర్వం సిద్ధం!
- న్యూయార్క్ వేదికగా దాయాదుల పోరు
- జోరు మీదున్న టీమిండియా
- ఆతిథ్య అమెరికా చేతిలో ఓటమితో డీలాపడ్డ పాకిస్థాన్
- టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌దే ఆధిపత్యం
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైవోల్టేజ్ మ్యాచ్ సమయం రానే వచ్చింది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య పోరుకు అంతా సిద్ధమైంది. న్యూయార్క్ వేదికగా దాయాదులు నువ్వానేనా అన్నట్లు తలపడబోతున్నాయి. అయితే, పొట్టి ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌కు ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరుజట్లు ఏడుసార్లు తలపడగా, ఆరు సార్లు టీమిండియా విజయం సాధించింది. ఒక్కసారి మాత్రమే పాక్ గెలిచింది.
మరోవైపు ఈ వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్‌పై ఘన విజయంతో భారత్ మంచి జోరుమీదుంటే.. ఆతిథ్య అమెరికా చేతిలో అనూహ్య పరాజయంతో దాయాది జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఇక ఐసీసీ మెగాటోర్నీలో కీలక మ్యాచ్‌గా భావిస్తున్న భారత్, పాక్ పోరులో పైచేయి ఎవరిదో మరికొన్ని గంటల్లో తేలనుంది.
యుద్ధాన్ని తలపించే ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు దేశాల అభిమానులు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. మెగాటోర్నీ కోసం న్యూయార్క్‌లో కొత్తగా నిర్మించిన నసావు కౌంటీ స్టేడియంలో ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య కీలక పోరు జరగనుంది. గ్రూప్-ఏలో భాగంగా ఇవాళ ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య 19వ మ్యాచ్ జరగనుంది. 34వేల మంది సామర్థ్యం కలిగిన నసావు స్టేడియం దాయాదుల మ్యాచ్‌కు కిక్కిరిసిపోయే అవకాశముంది.
జోరు మీదున్న టీమిండియా
2024 టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు జోరుమీద కనిపిస్తుంది. ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన రోహిత్‌సేన అదే దూకుడును ప్రదర్శించాలని చూస్తోంది. అటు నిలకడలేమికి చిరునామా అయిన పాక్‌కు చెక్ పెట్టేందుకు టీమిండియా అస్త్రశస్త్రాలతో రెడీ అయ్యింది. ఐర్లాండ్‌తో ఆడిన జట్టునే పాక్‌తో మ్యాచ్‌కు దాదాపు కొనసాగించే అవకాశముంది. అయితే, అక్షర్‌పటేల్ స్థానంలో స్పిన్నర్ కుల్దీప్‌యాదవ్ జట్టులోకి తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. రోహిత్, విరాట్ కోహ్లీ ఓపెనర్లుగా రానున్నారు. రిషబ్ పంత్ మూడో స్థానం ఫిక్స్ అయ్యింది.
అమెరికా చేతిలో ఓటమితో డీలాపడ్డ పాక్
మెగాటోర్నీలో పాకిస్థాన్‌కు ఆదిలోనే ఆతిథ్య అమెరికా జట్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. పాక్‌ను ఓడించి యూఎస్ జట్టు సంచలనం సృష్టించింది. దీంతో సూపర్-8కు అర్హత సాధించాలంటే టీమిండియాపై పాక్ గెలవక తప్పని పరిస్థితి నెలకొంది. షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, మహ్మద్ ఆమిర్, యాసిర్ షాతో పాక్ పేస్ దళం బలంగా కనిపిస్తుంది. కానీ, భారత బ్యాటర్లను ఎలా నిలువరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
అందరినీ టెన్షన్ పెడుతున్న నసావు స్టేడియం పిచ్
నసావు కౌంటీ స్టేడియంలో డ్రాప్ ఇన్ పిచ్‌లపై ఐసీసీ ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌లపై అటు ప్లేయర్లతో పాటు మాజీలు తమదైన శైలిలో విమర్శిస్తున్నారు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్, పంత్‌కు గాయాలు కాగా, పాక్‌తో పోరులో పిచ్ ఎలా స్పందిస్తుందనేది అంచనాలకు అందకుండా ఉంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో న్యూయార్క్ పిచ్ అందరినీ టెన్షన్ పెడుతోంది. ఇక ఈ పిచ్‌పై జరిగిన తొలి మ్యాచ్‍లో దక్షిణాఫ్రికాపై శ్రీలంక 77 పరుగులకే ఆలౌట్ అయింది. పిచ్ సమాంతరంగా లేకపోవటంతో బాల్ రకరకాలుగా బౌన్స్ అవుతోంది. దీంతో రెండు జట్లు భయపడుతున్నాయి.
టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌దే ఆధిపత్యం
టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకూ భారత్‌దే ఆధిపత్యం. ఈ మెగాటోర్నీలో భారత్, పాకిస్థాన్ ఇప్పటి వరకు ఏడుసార్లు తలపడితే, ఆరుసార్లు టీమిండియా విజయం సాధించింది. ఒక్కసారి మాత్రమే గెలిచింది పాక్. ఇక ఇవాళ కూడా టీమిండియాకే గెలిచే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.
జట్ల అంచనా
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్/కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
పాకిస్థాన్ జట్టు: బాబర్ ఆజమ్(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, ఉస్మాన్, ఫకర్ జమాన్, ఆజమ్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్/ఆయూబ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, ఆమిర్, హరీస్ రవూఫ్.