మ‌హాత్మాగాంధీ, వాజ్‌పేయికి ప్ర‌ధాని మోదీ నివాళులు

  • ఇవాళ రాత్రి 7.15 గంట‌ల‌కు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ప్ర‌ధానిగా మోదీ ప్ర‌మాణ స్వీకారం
  • ఈ సంద‌ర్భంగా రాజ్‌ఘాట్‌, స‌దైవ్ అట‌ల్‌కి వెళ్లి పుష్పాంజ‌లి ఘ‌టించిన మోదీ
  • మోదీ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ముస్తాబైన రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్
న‌రేంద్ర‌ మోదీ ఇవాళ మూడోసారి ప్ర‌ధానిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న విష‌యం తెలిసిందే. రాత్రి 7.15 గంట‌ల‌కు ఆయ‌న రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఇవాళ‌ ఉద‌యం మ‌హాత్మాగాంధీ, మాజీ ప్ర‌ధాని వాజ్‌పేయికి మోదీ నివాళులు అర్పించారు. రాజ్‌ఘాట్‌, స‌దైవ్ అట‌ల్‌కి వెళ్లి పుష్పాంజ‌లి ఘ‌టించారు. 

మోదీ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ముస్తాబు
నేడు ప్ర‌ధానిగా మోదీ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ముస్తాబైంది. శ‌ని, ఆదివారం రెండు రోజులు ఢిల్లీని అధికారులు నో ఫ్లైజోన్‌గా ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ప్రాంతంలో మూడంచెల భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. ఈ వేడుక‌కు ఇప్ప‌టికే పొరుగు దేశాల అధినేత‌లు, విదేశీ ప్ర‌తినిధులు, పారిశ్రామిక‌వేత్త‌ల‌తో పాటు సామాన్యుల‌కు ఆహ్వానాలు అందాయి. ఇక ప్ర‌మాణ స్వీకారం త‌ర్వాత మోదీ వార‌ణాసి వెళ్లి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు. 

మోదీతో స‌హా 30 మంది ప్ర‌మాణం?
ఇదిలాఉంటే.. మోదీతో పాటు బీజేపీ స‌హా ఎన్‌డీఏ ప‌క్షాల నుంచి సుమారు 30 మంది కేంద్ర‌మంత్రులుగా ప్ర‌మాణం చేసే అవ‌కాశం ఉంద‌ని ఎన్‌డీటీవీ వెల్ల‌డించింది. హోమ్‌, డిఫెన్స్‌, ఫైనాన్స్‌, విదేశాంగ మంత్రులుగా బీజేపీ నేత‌లే ఉంటార‌ని తెలిపింది. మొత్తంగా కేంద్ర కేబినెట్ 78 నుంచి 81 మందితో కొలువుదీర‌నుంద‌ని పేర్కొంది.


More Telugu News