టీ20 వరల్డ్ కప్: దక్షిణాఫ్రికా ముందు ఈజీ టార్గెట్
- వరల్డ్ కప్ లో నేడు దక్షిణాఫ్రికా × నెదర్లాండ్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
- నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 103 పరుగులు చేసిన డచ్ జట్టు
టీ20 వరల్డ్ కప్ లో నేడు దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 103 పరుగుల స్వల్ప స్కోరు చేసింది.
నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ లో సైబ్రాండ్ ఎంగెల్ బ్రెక్ట్ 40 పరుగులు చేశాడు. లోయర్డార్ లో వాన్ బీక్ 23 పరుగులు చేయడంతో డచ్ జట్టు స్కోరు 100 పరుగుల మార్కు దాటింది. సైబ్రాండ్, వాన్ బీక్ తప్ప నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ లో ఎవరూ పెద్దగా రాణించలేదు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో ఓట్నీల్ బార్ట్ మాన్ 4 వికెట్లతో రాణించాడు. మార్కో యన్సెన్ 2, ఆన్రిచ్ నోర్కియా 2 వికెట్లు తీశారు.