రామోజీరావు ఎవరికీ తలవంచకుండా పని చేశారు: కిషన్ రెడ్డి

రామోజీరావు ఎవరికీ తలవంచకుండా పని చేశారు: కిషన్ రెడ్డి
  • మీడియా రంగంలో కొత్త ఒరవడిని సృష్టించారన్న కేంద్రమంత్రి
  • ఎన్నో అంశాల్లో ఆయన చేసిన కృషిని మరువలేమని వెల్లడి
  • రాజ్యసభ సీటు ఆఫర్‌ను కూడా సున్నితంగా తిరస్కరించారన్న కిషన్ రెడ్డి
రామోజీరావు ఎవరికీ తలవంచకుండా పని చేశారని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. శనివారం రామోజీరావు పార్థివదేహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... మీడియా రంగంలో కొత్త ఒరవడిని సృష్టించారన్నారు. మద్యపాన నిషేధం, సామాజిక సమస్యలు, తెలుగు భాషను ప్రోత్సహించడం, సినిమా రంగంలో మార్పులు, ఫిల్మ్ సిటీ నిర్మాణం ఇలా ఎన్నో అంశాల్లో ఆయన కృషిని మరవలేమన్నారు.

వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు అన్నదాత పత్రికను తీసుకువచ్చారన్నారు. నష్టం వచ్చినా లెక్క చేయలేదన్నారు. తెలుగు భాష గురించి ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడన్నారు. ఆయన తీర్చిదిద్దిన ఎంతోమంది జర్నలిస్టులు తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యసభ సీటు ఆఫర్‌ను కూడా ఆయన సున్నితంగా తిరస్కరించారని తెలిపారు. చివరి వరకు ఆయన వ్యక్తిత్వం మారలేదని... ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయామన్నారు.


More Telugu News