ఉక్రెయిన్ యుద్ధం గెలవడానికి అణ్వాయుధాలు అక్కర్లేదు: రష్యా అధ్యక్షుడు పుతిన్
- ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉందని భావించడం లేదన్న రష్యా అధినేత
- దేశ సార్వభౌమాధికారానికి ముప్పు ఏర్పడినప్పుడే వాడతామని స్పష్టం
- అణ్వాయుధాలపై పశ్చిమ దేశాలు కలవరం చెందుతున్న వేళ పుతిన్ కీలక వ్యాఖ్యలు
ఉక్రెయిన్‌లో యుద్ధం గెలవడానికి అణ్వాయుధాలను ఉపయోగించాల్సిన అవసరం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు ముప్పు ఏర్పడే అసాధారణ సందర్భంలో మాత్రమే అణ్వాయుధాలను ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి వచ్చిందని తాను భావించడంలేదని, అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదని పుతిన్ పేర్కొన్నారు.
సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ ప్లీనరీ సెషన్‌లో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై గెలుపు కోసం పశ్చిమ దేశాలపై అణ్వాయుధాలను ఎక్కు పెట్టాల్సిందేనా అని రష్యాకు చెందిన ప్రముఖ విశ్లేషకుడు సెర్గీ కరగానోవ్ ప్రశ్నించగా పుతిన్ ఈ సమాధానం ఇచ్చారు.
రష్యా అణుయుద్ధాన్ని కోరుకోవడం లేదనే విషయం పుతిన్ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోందని, ఈ మేరకు సంకేతాలు ఇచ్చినట్టు అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా రష్యా తనను తాను రక్షించుకోవడానికి అవసరమైతే అణ్వాయుధాలను ఉపయోగిస్తుందని పుతిన్ పదేపదే చెప్పడంతో పాశ్చాత్య దేశాలు ఆందోళన చెందిన విషయం తెలిసిందే. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ మరో ఘోర యుద్ధం ముప్పు పొంచి ఉందని కలవరం చెందిన విషయం తెలిసిందే.