ఈ నెల 17, 25న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
- బక్రీద్ విషయంలో సందిగ్ధత
- దీనికి తెరదించుతూ 17న సెలవు ప్రకటన
- 25న ఈద్-ఇ-ఘాదిర్ సెలవు
- బ్యాంకులకు వరుసగా మూడు రోజుల సెలవులు
బక్రీద్ ఎప్పుడన్న విషయంలో ఈసారి కొంత గందరగోళం నెలకొనడంతో ప్రభుత్వ సెలవు విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. తాజాగా ఈ సంశయానికి తెరదించుతూ తెలంగాణ ప్రభుత్వం 17ను సెలవు దినంగా ప్రకటించింది. బక్రీద్ 17 అని కొందరు, 18 అని కొందరు చెప్పడంతో ఏ రోజు నిర్వహించుకుంటే ఆ రోజు సెలవు ఇవ్వాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది.
అయితే, తాజాగా 17ను సెలవు దినంగా ప్రకటించింది. జూన్ 17 సోమవారం కావడంతో స్కూళ్లు, కాలేజీలకు రెండు రోజుల సెలవులు లభించనున్నాయి. అలాగే, ఈ నెల 25న ఈద్-ఇ-ఘాదిర్‌ను పురస్కరించుకుని మరో సెలవు ప్రకటించింది.
అయితే, తాజాగా 17ను సెలవు దినంగా ప్రకటించింది. జూన్ 17 సోమవారం కావడంతో స్కూళ్లు, కాలేజీలకు రెండు రోజుల సెలవులు లభించనున్నాయి. అలాగే, ఈ నెల 25న ఈద్-ఇ-ఘాదిర్‌ను పురస్కరించుకుని మరో సెలవు ప్రకటించింది.