ఈ కిర్రాక్ మ్యాచ్ వేరే గ్రహంపై జరిగినా స్టేడియం హౌస్ ఫుల్!
- రంజుగా సాగుతున్న టీ20 ప్రపంచకప్
- చెలరేగుతున్న పసికూనలు
- పాకిస్థాన్‌పై అమెరికా అద్భుత విజయం
- న్యూజిలాండ్‌ను చిత్తుచేసిన ఆఫ్ఘనిస్థాన్
- రేపు భారత్-పాక్ మ్యాచ్
- దాయాదుల పోరును వీక్షించేందుకు రెడీ అవుతున్న ప్రపంచం
అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ20 ప్రపంచకప్ రంజుగా సాగుతోంది. పసికూనగా ముద్రపడిన జట్లు సత్తా చాటుతుండగా అగ్రశ్రేణి జట్లు చతికిలపడుతున్నాయి. అరివీర భయంకరమైన పాకిస్థాన్‌పై అమెరికా అత్యద్భుత విజయం సాధిస్తే 7న గయానాలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను, ఆఫ్ఘనిస్థాన్‌ను చిత్తుచేసింది.
ఇక ఈ నెల 5న ఐర్లాండ్‌తో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇప్పటి వరకు జరిగిన ఈ మ్యాచ్‌లన్నీ ఒక ఎత్తు.. 9న జరగనున్న భారత్-పాక్ మ్యాచ్ మరో ఎత్తు. ట్రోఫీ ఏదైనా, వేదిక ఎక్కడైనా సరే.. దాయాది జట్లు తలపడుతున్నాయంటే ఆ కిక్కే వేరు. ప్రపంచం మొత్తం ఆ మ్యాచ్‌ను కనులారా వీక్షిస్తుంది.
ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై తిరుగులేని రికార్డు కలిగిన టీమిండియా దానిని పదిలపరుచుకోవాలని భావిస్తే.. దానిని బ్రేక్ చేసేందుకు పాక్ విపరీతంగా శ్రమిస్తుంది. అందుకే ఇరు జట్లు బెబ్బులిలా తలపడతాయి. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా రేపు (9న) న్యూయార్క్‌లో జరగనున్న మ్యాచ్ కోసం ఇప్పుడు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ మ్యాచ్‌కు ఎంత డిమాండ్ ఉందంటే.. డైమండ్ క్లాస్ టికెట్ ఏకంగా రూ. 16 లక్షలు పలుకుతోంది. అయినా సరే ఎవరూ వెనక్కి తగ్గేదే లే.. అంటూ టికెట్లు సొంతం చేసుకున్నారు. దీనిని బట్టి దాయాదుల పోరుకు ఉండే క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.