నారా లోకేశ్ ను కలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు
- మంగళగిరి అసెంబ్లీ స్థానంలో ఘనవిజయం సాధించిన నారా లోకేశ్
- 91 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలుపు
- లోకేశ్ పై అభినందనల వెల్లువ
- లోకేశ్ ను కలిసి విషెస్ తెలిపిన హీరో నిఖిల్, బండ్ల గణేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, బీజేపీ నేతలు, సినీ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. భారీ మెజారిటీలతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలను లోకేశ్ అభినందించారు.
సినీ రంగం నుంచి లోకేశ్ ను కలిసిన వారిలో నిర్మాత బండ్ల గణేష్, హీరో నిఖిల్ తదితరులు ఉన్నారు. వారు లోకేశ్ ని కలిసి అభినందనలు తెలిపారు. ఉండవల్లి నివాసంలో ఈ రోజు సుమారు 2 వేల మంది కార్యకర్తలను కలిసిన లోకేశ్ అందరితో ఫోటోలు దిగారు.
మంగళగిరి నియోజవకర్గంలో గత ఎన్నికల్లో ఓటమిపాలైన నారా లోకేశ్, ఈసారి 91 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. లోకేశ్ కు ఏపీ మంత్రివర్గంలో స్థానం ఖాయమైన సంగతి తెలిసిందే.