రాష్ట్రపతిని కలిసి లేఖలు అందించిన నడ్డా, చంద్రబాబు తదితరులు

  • బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీ
  • తీర్మానాన్ని సమర్థిస్తూ మద్దతు లేఖలు అందించిన ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు
  • ఆ లేఖలను రాష్ట్రపతికి అందించిన నడ్డా, చంద్రబాబు తదితరులు
  • మరి కొన్ని గంటల్లో క్యాబినెట్ మంత్రుల వివరాలు వెల్లడయ్యే అవకాశం
ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాల నేతలు ఈ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీని ఎన్నుకున్నామని ఆ మేరకు ద్రౌపది ముర్ముకు లేఖ అందించారు. ఈ తీర్మానాన్ని సమర్ధిస్తూ ఎన్డీయే కూటమి పార్టీలు ఇచ్చిన మద్దతు లేఖలను కూడా రాష్ట్రపతికి సమర్పించారు. 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి నేతలు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నితీశ్ కుమార్, ఏక్ నాథ్ షిండే, కుమారస్వామి, చిరాగ్ పాశ్వాన్, అనుప్రియ పటేల్ తదితరులు రాష్ట్రపతి భవన్ కు వచ్చి ద్రౌపది ముర్మును కలిశారు. 

కాగా, ఈ రాత్రికి గానీ, రేపు ఉదయం గానీ కేంద్ర క్యాబినెట్ సభ్యుల వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా ఎన్డీయే నాయకత్వం కసరత్తులు ముమ్మరం చేసింది.


More Telugu News