లో‌క్‌సభ ఎన్నికల్లో పెరిగిన థర్డ్ జెండర్ ఓటింగ్ శాతం

  • దాదాపు 25 శాతంగా నమోదైన థర్డ్ జెండర్ ఓటింగ్
  • 2019 సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే 14.58 శాతం పెరుగుదల
  • స్పష్టం చేసిన ఎన్నికల సంఘం గణాంకాలు
ఇటీవలి లోక్‌సభ ఎన్నికలలో ఓటు వేసిన థర్డ్ జెండర్ వ్యక్తుల సంఖ్య పెరిగిందని, 2019 సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే సుమారు 25 శాతం అధికంగా ఓటింగ్ నమోదయిందని కేంద్ర ఎన్నికల సంఘం డేటా వెల్లడించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో థర్డ్ జెండర్ల ఓటింగ్ శాతం కేవలం 14.58 శాతం మాత్రమేనని ఈసీ పేర్కొంది. మొత్తం ఏడు దశల ఎన్నికలకు సంబంధించిన పూర్తి డేటాను ఈసీ విడుదల చేసింది.

ఏప్రిల్ 19న తొలి దశలో థర్డ్ జెండర్ ఓటర్లలో 31.32 శాతం, ఏప్రిల్ 26న జరిగిన రెండో దశలో 23.86 శాతం, మే 7న జరిగిన మూడో దశలో 25.2 శాతం, మే 13న జరిగిన నాలుగో దశలో 34.23 శాతం, మే 20న జరిగిన ఐదో దశలో 21.96 శాతం, మే 25న జరిగిన ఆరవ దశలో 18.67 శాతం, జూన్ 1న జరిగిన ఏడవ దశలో 22.33 శాతం థర్డ్ జెండర్ ఓటింగ్ నమోదైందని గణాంకాలు స్పష్టం చేశాయి. కాగా 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 4,87,803 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. 

ఎన్నికల సంఘం డేటా ప్రకారం.. పురుషుల్లో శాతం 63.11 శాతం, మహిళల్లో 64.72 శాతం, థర్డ్ జెండర్ వ్యక్తుల్లో 22.33 శాతంగా పోలింగ్ నమోదయింది.


More Telugu News