కాంగ్రెస్‌లోకి రండి... రాజకీయ భవిష్యత్తు కాపాడుకోండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దానం నాగేందర్ పిలుపు
- లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీకి కనీసం డిపాజిట్లు రాలేదన్న దానం నాగేందర్
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తే రేవంత్ రెడ్డి తగిన గౌరవం ఇస్తారని హామీ
- మోదీ నైతికంగా ఓడిపోయారన్న దానం నాగేందర్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలోకి రావాలని మాజీ మంత్రి దానం నాగేందర్ ఆహ్వానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా రాలేదన్నారు. అంతకుముందు, ఎమ్మెల్యేలుగా గెలిచిన నియోజకవర్గాల్లోనూ డిపాజిట్లు రాలేదన్నారు. కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు... వారి రాజకీయ భవిష్యత్తు కోసం, రాజకీయ మనుగడ కోసం కాంగ్రెస్ పార్టీలోకి రావాలన్నారు. రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఉండాలని కోరుకునే వారు... ప్రజాసేవ చేయాలని కోరుకునే వారు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని సూచించారు.
వారు తమ పార్టీలోకి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి తగిన గౌరవం ఇస్తారని హామీ ఇచ్చారు. బీజేపీ మోదీ ఫ్యాక్టర్ అని చెబుతోందని... కానీ అయోధ్యలోని లోక్ సభ నియోజకవర్గంలోనే ఆ పార్టీ ఓడిపోయిందన్నారు. అలాగే వారణాసిలో 2019లో ఐదు లక్షలకు పైగా మెజార్టీ వచ్చిన మోదీకి ఈసారి లక్షకు పైగా మాత్రమే వచ్చిందన్నారు. అంటే నైతికంగా ఆయన ఓడిపోయినట్లేనని వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల్లో తనకు ఓటేసిన ప్రజలందరికీ దానం ధన్యవాదాలు తెలిపారు.
ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి... మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిన అంశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ఈ అంశం కోర్టులో ఉందని, కోర్టుకు సమాధానం చెబుతానని తెలిపారు.