ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిల ఆశీర్వాదం తీసుకున్న మోదీ
- ప్రభుత్వ ఏర్పాటుకు ముందు బీజేపీ కురువృద్ధులను కలిసిన ఎన్డీయే పక్ష నేత
- రాష్ట్రపతి ముర్ముని కలవనున్న ఎన్డీయే నేతలు
- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ విజ్ఞాపన చేయనున్న నేతలు
ఎన్డీయే పక్ష నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఎన్డీయే నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని నేడు (శుక్రవారం) కలవనున్నారు. ఎన్డీయే పక్ష నేతగా మోదీ ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో నేతలు వెళ్లి రాష్ట్రపతిని కలవనున్నారు.
కాగా రాష్ట్రపతి వద్దకు వెళ్లడానికి ముందు నరేంద్ర మోదీ బీజేపీ కురువృద్ధులు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను కలిశారు. వారి నివాసాలకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. తొలుత ఎల్‌కే అద్వానీ ఇంటికి, ఆ తర్వాత జోషి నివాసానికి ఆయన వెళ్లారు. అలాగే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నివాసానికి కూడా వెళ్లి ఆయనను మోదీ కలిశారు. ఇదిలావుంచితే జూన్ 9 సాయంత్రం 6 గంటలకు దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.