కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంది: ముఖేశ్ కుమార్ మీనా

  • ఏపీలో ముగిసిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు
  • టీడీపీ కూటమి ఘన విజయం
  • నేడు తిరుమల విచ్చేసిన ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా
  • ఎన్నికలు సజావుగా నిర్వహించామని వెల్లడి
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల క్రతువు ముగిసింది. మే 13న పోలింగ్ జరగ్గా, జూన్ 4న కౌంటింగ్ జరిగింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘనవిజయం సాధించగా, వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఫలితాలు కూడా వెల్లడి కాగా, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసింది. 

ఈ నేపథ్యంలో, ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా నేడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగిందని, ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎన్నికలు పూర్తి చేశామని చెప్పారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా ముగిసిందని ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. 

ఎన్నికలు సాఫీగా పూర్తి కావడంతో వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకునేందుకు తిరుమల వచ్చామని వెల్లడించారు. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని అన్నారు.


More Telugu News