భారీ లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు
- సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం
- మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ
- సానుకూలతల మధ్య జోరుగా కొనసాగుతున్న ట్రేడింగ్
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడం, కేంద్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు లేకపోవడం వంటి సానుకూల పరిణామాల నేపథ్యంలో, నేడు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి.
ఉదయం నుంచే సెన్సెక్స్, నిఫ్టీలో ట్రేడింగ్ జోరు అందుకుంది. విప్రో, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా... బ్రిటానియా, ఎస్ బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఆటో షేర్లు నష్టాలు చవిచూశాయి.
ప్రస్తుతం నిఫ్టీ సూచీ 23 వేలకు పైన ట్రేడవుతుండగా, సెన్సెక్స్ 1400 పాయింట్ల వృద్ధి నమోదు చేసింది.