ఏపీ బేవరేజెస్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు
- వాసుదేవరెడ్డి నివాసంపై సీఐడీ దాడులు
- హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని నివాసంలో ఉదయం నుంచి సోదాలు
- కీలక పత్రాలను పరిశీలిస్తున్న సీఐడీ అధికారులు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నూతన మద్యం పాలసీ పేరిట దోపిడీ పర్వానికి సహకరించారన్న ఆరోపణల నేపథ్యంలో, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి నివాసంలో నేడు సీఐడీ సోదాలు చేపట్టింది.
వాసుదేవరెడ్డి హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో నివాసం ఉంటున్నారు. ఈ ఉదయాన్నే వాసుదేవరెడ్డి నివాసానికి వెళ్లిన ఏపీ సీఐడీ అధికారులు వివిధ కీలక పత్రాలను తనిఖీ చేస్తున్నారు. మాజీ సీఎం జగన్ కు వాసుదేవరెడ్డి బలమైన మద్దతుదారుడు అని ప్రచారంలో ఉంది.
రాష్ట్రంలోని మద్యం డిస్టిలరీలు అనధికార మార్గాల్లో వైసీపీ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంలో వాసుదేవరెడ్డిదే కీలక పాత్ర అని, తద్వారా మద్యం రూపంలో వైసీపీకి భారీ ఆదాయం లభించిందన్న ఆరోపణలు ఉన్నాయి.