పవన్ అంటే పవనం అనుకున్నారేమో... తుపాను: నరేంద్ర మోదీ

  • ఎన్డీయే పక్ష నేతగా ఎన్నికైన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగం
  • ఏపీ ప్రజలు తమకు అతిపెద్ద బహుమతి ఇచ్చారని వ్యాఖ్య
  • ఏపీలో చారిత్రక విజయం సాధించినట్లు చంద్రబాబు తనతో చెప్పారన్న మోదీ
  • పవన్ మన సమక్షంలోనే ఉన్నారని కూటమి నేతలతో మోదీ వ్యాఖ్య
పార్లమెంటు సెంట్రల్ హాలులో ఎన్డీయే లోక్ సభా పక్ష నేతను ఎన్నుకునే కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ ఇక్కడే ఉన్నాడు... పవన్ అంటే పవనం అనుకున్నారేమో... తుపాను అని అభివర్ణించారు. 

ప్రధాని వ్యాఖ్యలతో పవన్ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం, ప్రధాని ప్రసంగం కొనసాగిస్తూ... ఏపీలో కూటమి సాధించింది మామూలు విజయం కాదని, మహా విజయం అని కొనియాడారు. ఆ భారీ విజయం ఏపీ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందని అన్నారు. ఏపీ ప్రజలు తమకు ఇచ్చిన బహుమతిగా ఈ విజయాన్ని భావిస్తామని చెప్పారు.

ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో క్లీన్ స్వీప్ చేశామని, ముఖ్యంగా ఏపీలో చంద్రబాబుతో కలిసి చారిత్రాత్మక విజయం సాధించామని తెలిపారు. ఏపీ ప్రజలు తమకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారని మోదీ హర్షం వ్యక్తం చేశారు.


More Telugu News