టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారంపై స్పందించిన నాగబాబు

  • ఏపీలో కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించిన పవన్ కల్యాణ్
  • సోదరుడు నాగబాబు సీటును కూడా త్యాగం చేసిన జనసేనాని
  • దీంతో నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం
  • తప్పుడు వార్తలు విశ్వసించవద్దని నాగబాబు విజ్ఞప్తి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో అన్నయ్య, మెగా బ్రదర్ నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంపై స్వయంగా నాగబాబు స్పందించారు. తనకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. 

'ఎలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దు. పార్టీ అధికారిక ఎక్స్ హ్యాండిల్ లేదా నా అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే విశ్వసించండి. దయచేసి తప్పుడు వార్తలను విశ్వసించవద్దు లేదా ప్రచారం చేయవద్దు.' అని నాగబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

ఏపీలో కూటమి విజయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ కీలక పాత్ర పోషించారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదన్న ఉద్దేశ్యంతో పవన్ కల్యాణ్ చాలా సీట్లను త్యాగం చేశారు. సోదరుడు నాగబాబు పోటీ చేద్దామనుకున్న ఎంపీ స్థానాన్ని కూడా వదిలేశారు. ఈ నేపథ్యంలో జనసేనాని విజ్ఞప్తి మేరకు టీటీడీ పదవిని నాగబాబుకే చంద్రబాబు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని నాగబాబు ఖండించారు.


More Telugu News