ఇక మీరు మారిన చంద్రబాబును చూస్తారు: ఎంపీలతో భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- 'చంద్రబాబు' మారరు అనే అపవాదు ఉంది... ఇక అలా ఉండదని వ్యాఖ్య
- ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఉండదన్న చంద్రబాబు
- తన కోసం ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు ప్రాణాలిచ్చారన్న టీడీపీ అధినేత
- ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి పని చేయాలని సూచన
'చంద్రబాబు మారరు అనే అపవాదు నాపై ఉంది... కానీ మీరు మారిన చంద్రబాబును చూస్తారు. ఇక అలా ఉండదు... మీరే ప్రత్యక్షంగా చూస్తార'ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ ఎంపీలతో జరిగిన భేటీలో టీడీపీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఎంతమాత్రమూ ఉండదన్నారు. రాజకీయ పరిపాలన సాగుతుందని స్పష్టం చేశారు. ఎంపీలు అందరూ తరుచూ తనను వచ్చి కలవాలని సూచించారు. బిజీగా ఉన్నప్పటికీ మీతో మాట్లాడుతానని స్పష్టం చేశారు.
తన కోసం ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు ప్రాణాలు ఇచ్చారన్నారు. కత్తి మీద పెట్టినా జై టీడీపీ, జై చంద్రబాబు అన్నారని గుర్తు చేసుకున్నారు. అధికార పార్టీ ఒత్తిడికి ఎవరూ తలొగ్గలేదని పేర్కొన్నారు. ఇకపై ప్రతి అంశాన్ని వింటాను... నేనే స్వయంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి పని చేయాలని సూచించారు. అందరూ ఎవరి పరిధిలో వారు పని చేయాలన్నారు. ఈ అయిదేళ్లు నేతలు, కార్యకర్తలు పడిన ఇబ్బందులు తనకు మనోవేదన కలిగించాయని భావోద్వేగానికి లోనయ్యారు.