ఎన్నికల కోడ్‌కు ముందు... టీచర్ల బదిలీలపై ఇచ్చిన ఉత్తర్వుల నిలిపివేత

  • ఎన్నికలకు ముందు 1,800 మంది టీచర్లను బదిలీ చేయాలని గత ప్రభుత్వం ఉత్తర్వులు
  • అధికారుల ఒత్తిడితో పైరవీలు జరిగినట్లుగా ఆరోపణలు
  • ఈ నేపథ్యంలో టీచర్ల బదిలీలు చేపట్టవద్దని పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ల బదిలీలపై ఎన్నికల కోడ్‌కు ముందు ఇచ్చిన ఉత్తర్వులను విద్యాశాఖ నిలిపివేసింది. ప్రస్తుతం ఎలాంటి బదిలీలు చేపట్టవద్దని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

సార్వత్రిక, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొత్తం 1,800 మంది టీచర్లను బదిలీ చేయాలని గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ముఖ్యమంత్రి పేషీలోని కొందరు అధికారుల ఒత్తిడితో పైరవీలు, సిఫార్సులు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.


More Telugu News