అహంకారపూరిత రాజును మోకాళ్లపై నిలబెట్టిన యోధుడు రాహుల్ గాంధీ: సీతక్క
- దేశంలో జరుగుతున్నదానిని మీడియా చూపించలేదన్న సీతక్క
- వాస్తవాన్ని చూపించి ఉంటే ఇండియా కూటమి క్లీన్‌స్వీప్ చేసి ఉండేదన్న మంత్రి
- దేశం కోసం పోరాటం కొనసాగుతుందన్న నేత
లోక్‌సభ ఎన్నికల్లో విజయానికి దగ్గరలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఆగిపోవడంపై ఆ పార్టీ నేత, తెలంగాణ మంత్రి సీతక్క స్పందించారు. మీడియా కళ్లకు గంతలు కట్టుకుందని, దేశంలో వాస్తవంగా జరుగుతున్నదేంటో నిజంగా చూపించి ఉంటే ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసి ఉండేదని అన్నారు.
ఏది ఏమైనా రాహుల్ గాంధీ ఓ యోధుడని కొనియాడారు. అహంకారంతో వ్యవహరించే షెహన్‌షా(రాజు)ను మోకాళ్లపై కూర్చోబెట్టారని మోదీని ఉద్దేశించి ఎక్స్‌లో పేర్కొన్నారు. తామంతా రాహుల్ వెంటే ఉన్నామని తెలిపారు. దేశం కోసం పోరాటం కొనసాగిద్దామని సీతక్క పేర్కొన్నారు.